థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు మేం రెడీ

థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు మేం రెడీ

హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు అన్నారు. కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాస రావు నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్‌లు తగ్గుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36.50 శాతం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండాయన్నారు. 

‘మే 29 నుంచి రోజుకు సరాసరి లక్ష కరోనా పరీక్షలు జరుపుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 66,79,098 వ్యాక్సిన్లు ఇచ్చాం. కరోనా మూడో వేవ్ను‌‌ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలను రెడీ చేశాం. మిగతా 15 వేల పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో 132 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చాం. నీలోఫర్ ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలను సిద్ధం చేస్తున్నాం. థర్డ్ వేవ్‌తో పిల్లలకు ప్రమాదం ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పిల్లల కోసం 4 వేల పడకలను రెడీ చేస్తున్నాం. వైద్య సిబ్బంది పెంపునకు, శిక్షణకు ప్రతిపాదనలు పంపాం’ అని శ్రీనివాస రావు పేర్కొన్నారు.