పాల్వంచలో ‘ధన’ గణపతి..రూ.1.50కోట్లతో మండపం అలంకరణ

పాల్వంచలో ‘ధన’ గణపతి..రూ.1.50కోట్లతో మండపం అలంకరణ

పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మోర్ సూపర్ మార్కెట్ కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో  రూ.1.50 కోట్లతో మండపాన్ని అలంకరించారు. దీంతో మండపం భక్తులతో కిటకిటలాడింది.

 ప్రతి సంవత్సరం అత్యధికంగా నగదు అలంకరించే మండపంగా గుర్తింపు పొందిన ఈ మండపం శుక్రవారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్య క్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎన్పీ నాయుడు, మల్లేశ్​నాయుడు, ఎం.శ్రీనివాసరావు, పూజారి సంపత్ కుమార్ ఆచార్యులు పాల్గొన్నారు.  ములకలపల్లి మండల కేంద్రంలో కూడా వినాయకుడి విగ్రహాన్ని భారీగా నగదుతో అలంకరించారు.