తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన, అభిమానులు కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ధనుష్ స్పీచ్ వైరల్:
చెన్నైలో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న కోలీవుడ్ స్టార్ హీరో-డైరెక్టర్ ధనుష్.. అభిమానులను కేవలం సినిమా వేడుకలు, ఆడియో లాంచ్‌లకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. అందరి ఐక్యతకు ఒక సార్థకత ఉండాలని, "మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడాలి, మీరు అలా చేస్తారని నమ్ముతున్నా" అని మాట్లాడారు.
ఈ క్రమంలోనే ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల విజయ్ రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన నేపథ్యంలో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#Dhanush gives a Strong hint about his Political Entry:
— Laxmi Kanth (@iammoviebuff007) July 26, 2026
"So many people have gathered in one place.. This kind of unity has a power..💪 You need to give that unity a purpose.. Not just through audio launches and meet ups. Join hands and do more welfare work.. Do whatever you can…
అప్పుడు ప్రశ్నించలేదు.. ఇప్పుడు ఎందుకు?- ధనుష్
ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’ చిత్రం ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఈ అవార్డుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ‘మహారాజా’, ‘సత్యం సుందరం’ (Meiyazhagan) వంటి చిత్రాలు ఈ అవార్డుకు మరింత అర్హమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ విమర్శలపై లేటెస్ట్గా స్పందించిన ధనుష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మహారాజా’, ‘సత్యం సుందరం’ వంటి చిత్రాలు మరింత మెరుగ్గా ఉండి ఉండవచ్చని అంగీకరించారు. అయితే తన గత చిత్రాలైన ‘వడ చెన్నై’, ‘కర్ణన్’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సామాజిక నేపథ్య చిత్రాలకు జాతీయ అవార్డులు రానప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని గుర్తు చేశారు.
ఇప్పుడు ‘రాయన్’కు అవార్డు రావడాన్ని మాత్రమే తప్పుబట్టడం సరైన విధానం కాదని ధనుష్ అన్నారు. అలాగే, ఒకే ఏడాదిలో ఓ తమిళ నటుడికి రెండు జాతీయ అవార్డులు రావడం మొత్తం తమిళ సినీ పరిశ్రమ గర్వించాల్సిన విషయమని, విమర్శల కంటే ఆ విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలని పిలుపునిచ్చారు
#72Nationalawards లొ తన దర్శకత్వ చిత్రం #Raayan కు ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డు రావడాన్ని వ్యతిరేకిస్తున్న విమర్శలపై #Dhanush స్పందించారు.
— SZN (@Suzenbabu) July 26, 2026
#Maharaja #Meiyazhagan చిత్రాలు మెరుగ్గా ఉండవచ్చని అంగీకరించినా..
తన గత చిత్రాలైన #VadaChennai #Karnan వంటి గొప్ప సినిమాలకు జాతీయ… pic.twitter.com/6FF7L5urB5
