సీసీఎస్ ఏసీపీ బదిలీపై ధన్వంతరి బాధితుల ఆందోళన

సీసీఎస్ ఏసీపీ బదిలీపై  ధన్వంతరి  బాధితుల ఆందోళన

బషీర్​బాగ్, వెలుగు: ధన్వంతరి కేసులో రాష్ట్ర హైకోర్టు నుంచి తీర్పు వెలువడే కీలక సమయంలో సీసీఎస్ ఏసీపీ బదిలీ కావడం, కొత్త ఏసీపీ రాకపోవడం, తీర్పులో జాప్యం జరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని బాధితులు వాపోయారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ గత రెండు దశాబ్దాలుగా 4,200 మంది బ్రాహ్మణుల నుంచి రియల్ ఎస్టేట్, అధిక వడ్డీల పేరిట రూ.1,500 కోట్లు సేకరించి మోసాలకు పాల్పడిందన్నారు.

గురువారం హైదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ధన్వంతరి విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ బాధితులతో కలిసి మాట్లాడారు. సీసీఎస్​కు కొత్త ఏసీపీ నియమించి, హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.