- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, వెలుగు : ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నిమిషం కూడా పనిచేయం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. భూములు అమ్మి కమీషన్లు తీసుకోవడం అనే అంశంపైనే ఫోకస్ పెడుతున్నారని ఆరోపించారు. సీఎం సహా మంత్రులందరి తీరు అలాగే ఉందని, అవినీతిని కాపాడే ఆఫీసర్లకే టాప్ పోస్టులు ఇస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ లోని బీజేపీ ఆఫీస్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. పీఎం కుసుమ్ స్కీమ్ కింద యూనిట్ కరెంట్ రూ.3కే వీలుండగా రూ. 13 పెట్టి ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. పీఎం కుసుమ్ ప్లాంట్స్ నడుపుతున్న ఓనర్లను సతాయిస్తున్నరని, మూడు రోజుల్లో అన్ని విషయాలు బయటపెడతానన్నారు.
కరెన్సీ నోట్లను ట్రాక్చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని, ప్రతి నోట్ పై ట్రాకింగ్ చిప్ ఉండబోతోందని చెప్పారు. యారియా యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొదట ఒక మండలం లేదా ఒక జిల్లాలో పైలెట్ గా అమలు చేసి సక్సెస్ అయితే మిగతా చోట్ల అమలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కమీషన్లు తీసుకొని పనికిమాలిన యాప్ ను వ్యవసాయ రంగంపై రద్దుతున్నారన్నారు. కమ్యూనిస్ట్లు ఎదగరని, పార్టీని డెవలప్ చేసుకోలేరని, అలాగే దేశాన్ని కూడా డెవలప్ కానీయరని విమర్శించారు .
