సాగు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలి.. ధర్మసాగర్ రిజర్వాయర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీరందిస్తాం..

సాగు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలి.. ధర్మసాగర్ రిజర్వాయర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీరందిస్తాం..

ధర్మసాగర్, వెలుగు: ధర్మసాగర్, ఘనపూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్ల కింద ఉన్న పాత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేలా పంట కాలువలను పునరుద్ధరించి, రెండు పంటలకు నీరు అందిస్తామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. బుధవారం ధర్మసాగర్ రిజర్వాయర్ నక్కల తూము నుంచి నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే సాగునీటిని విడుదల చేశారు. 

తొలిసారి నక్కల తూము నుంచి నీరు విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేసిన రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పాత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేసి నెలలోపు పునరుద్ధరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నక్కల తూము నుంచి విడుదలైన నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా 10 మంది రైతులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.