ధర్మవరం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్

ధర్మవరం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్

రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ధర్మవరం’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో  అందర్నీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు రాజ్ చెప్పాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ డేట్‌‌ అనౌన్స్ చేస్తామని నిర్మాతలు ప్రసాద్, నెరిమెట్ల వెంకట రెడ్డి అన్నారు. అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు విజేత్ కృష్ణ సంగీతం అందిస్తున్నాడు.