బీఆర్ఎస్​ నేతల కబ్జాలకు నిరసనగా ధర్నా

బీఆర్ఎస్​ నేతల కబ్జాలకు నిరసనగా ధర్నా

నవాబుపేట,వెలుగు: బీఆర్ఎస్​ నాయకుల కబ్జాలకు నిరసనగా గురువారం స్థానిక అంబేద్కర్​ చౌరస్తాలో బాధిత రైతులు ధర్నాకు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ మండల కేంద్రంలో పదేండ్లుగా బీఆర్ఎస్​ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని, అధికారం కోల్పోయినా కబ్జాలు ఆగడం లేదన్నారు. రెండు రోజుల కింద బీఆర్ఎస్​ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తూ పొలాల్లోకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడగా, ఎదురుదాడికి దిగామని తెలిపారు. .

కబ్జాలకు పాల్పడే వారిపై  ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతులు మరికంటి వెంకటయ్య, స్వామి, పుట్టి శ్రీనివాసులు, శ్రీశైలం, మహిళా రైతులు డిమాండ్​ చేశారు. ధర్నాకు మండల కాంగ్రెస్​ నాయకులు కొల్లి నర్సింలు,కోట్ల రాజేశ్, బంక వెంకటయ్య, ఆనంద్, సత్యం, పెంటయ్య, ఆంజనేయులు, రాము, కుమార్​ సంఘీభావం తెలిపారు.