మంత్రి సబిత ఇంటి ముందు డీఎస్సీ 2008 అభ్యర్ధుల ధర్నా

మంత్రి సబిత ఇంటి ముందు డీఎస్సీ 2008 అభ్యర్ధుల ధర్నా

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసు ముందు డీఎస్సీ 2008 అభ్యర్థులు ధర్నా చేశారు. అనంతరం మంత్రి సబిత ఇంటిని ముట్టడి చేశారు. డీఎస్సీ 2008 మెరిట్ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల 870 మంది నష్టపోయామని బాధితులు ఆరోపించారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలు చేయడం లేదని అవేదన వ్యక్తం చేశారు.

గత కొన్ని రోజుల క్రితమే ఈ విషయంపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో14 ఏళ్ల నిరీక్షణ తర్వాత అభ్యర్థులకు న్యాయం లభించిందని భావించారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ లో భర్తీ చేయకుండా ఉన్న 1815 పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు.