జేఎన్టీయూ యూనివర్సిటీ గేటు ముందు విద్యార్థుల ధర్నా

జేఎన్టీయూ యూనివర్సిటీ గేటు ముందు విద్యార్థుల ధర్నా

కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీ మెయిన్ గేటు ముందు ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలోని R17, R18, R 22లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని.. కరోనా సమయంలో విద్యార్థులకు క్లాస్ లు జరగక చాలా ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. 

యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలలో మార్పులు చేసి R17, R18, R 22 లో డైటైన్ అయిన విద్యార్థులను మినహాయించి.. తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ముగిసిన తర్వాత భారీ ఎత్తున జేఎన్టీయూ యూనివర్సిటీని ముట్టడించి.. పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు వారికి న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ కోరారు.