మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో హైవేపై ధర్నా

మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో హైవేపై ధర్నా
  • మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో హైవేపై ధర్నా
  • మహబూబాబాద్ జిల్లా మరిపెడ టౌన్​లో ఘటన
  • భారీగా ట్రాఫిక్ జామ్

మరిపెడ, వెలుగు: ఎండాకాలం ప్రారంభం కావడంతో పలుచోట్ల తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మంచినీళ్ల కోసం జనం రోడ్ల మీదికి వస్తున్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ టౌన్​లో ఖమ్మం–వరంగల్ నేషనల్ హైవే మీద గ్యామ తండావాసులు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇంటి ముందే ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారం పది రోజులు నుంచి మిషన్ భగీరథ మంచినీళ్లు రావడంలేదని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు.

దీంతో భారీ ఎత్తున వెహికల్స్​ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే స్పాట్​కు చేరుకున్న మునిసిపల్ కమిషనర్ రాజు.. నీటి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. అయినా తండావాసులు ఆందోళన విరమించలేదు. సమాచారం అందుకున్న మరిపెడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి సర్దిచెప్పి పంపించారు.