మొహాలీ వన్డే : ధావన్ ధనాధన్..సెంచరీ

మొహాలీ వన్డే : ధావన్ ధనాధన్..సెంచరీ

మొహాలి: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. తనకు బాగా అచ్చొచ్చిన గ్రౌండ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. మెరుపు బ్యాటింగ్‌ తో ఆసీస్ పేసర్లను ఉతికారేస్తున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో 12ఫోర్లు, ఒక్క సిక్స్ సెంచరీ చేసుకున్నాడు. వన్డే కెరీర్‌ లో ధావన్‌ కిది 16వ సెంచరీ. ధావన్ తో పాటు రోహిత్ కూడా రాణించాడు. అయితే 31వ ఓవర్ లో రోహిత్ (95) ఔట్ కావడంతో సెంచరీ మిస్ అయ్యింది. 35 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టానికి 222 రన్స్. ధావన్(115), రాహుల్ (10) క్రీజులో ఉన్నారు.