మహిళలు, బాలికల రక్షణకే ‘ధీర’ : మల్కాజిగిరి సీపీ సుమతి

మహిళలు, బాలికల రక్షణకే ‘ధీర’ : మల్కాజిగిరి సీపీ సుమతి

మల్కాజిగిరి, వెలుగు: మహిళలు, బాలికల రక్షణ, సాధికారత కోసమే మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ధీర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీ సుమతి తెలిపారు. సోమవారం కీసరలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్​లో నిర్వహించిన ఈ శిక్షణలో 1,250 మందికి పైగా బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని 7 సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డివిజన్లలో ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి, విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్, ప్రాక్టికల్ సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 

అత్యవసర సమయాల్లో 112 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాలన్నారు. ఆత్మరక్షణ అంటే కేవలం శారీరక బలం కాదని, మానసిక చురుకుదనం, ఆత్మవిశ్వాసం అని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు గుర్తింపునివ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు శ్రీధర్, ఉషారాణి, ఏసీపీలు వెంకటేశ్వర్లు, చక్రపాణి, కీసర ఎస్​హెచ్​వో ఆంజనేయులు, షీ టీమ్స్​ఇన్​స్పెక్టర్​అంజయ్య, స్కూల్​ప్రిన్సిపాళ్లు రాములు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.