ఇంటర్నేషనల్ క్రికెట్ ధోనీ గుడ్ బై

ఇంటర్నేషనల్ క్రికెట్ ధోనీ గుడ్ బై

ఏడాదిన్నర సస్పెన్స్ కు తెర

మూడు ప్రపంచకప్ లు ఆడిన ముచ్చటైన వీరుడు..!

ఎనిమిదిన్నర దశాబ్దా ల చరిత్రకు కొత్త రంగు పులిమిన ధీరుడు..!

టీమిం డియా కెప్టెన్సీ రికార్డులను తిరగరాసిన యోధుడు..!

ప్రపంచ క్రికెట్ ను తన దరికి తెచ్చుకున్న మేరునగధీరుడు..!

ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి.. జులపాల జుట్టుతో ఆట

మొదలుపెట్టి.. మూస ధోరణి క్రికెట్ కట్టిపెట్టి..

ధైర్యానికి ప్రతీకగా ఎదిగాడు..! నైపుణ్యానికి అండగా నిలిచాడు..!

సవాళ్లకు ఎదురొడ్డి మెదిలాడు..!

తన పేరు చెబితే.. అద్భుతం కూడా కొన్నిసార్లు మూగబోతుంది..!

ఆశ్చర్యం కూడా కొన్నిసార్లు అసూయపడుతుంది..!

ఆలోచన కూడా కొన్నిసార్లు అలిగి వెళ్లిపోతుంది..!

తన ఆట చూస్తే.. వ్యూహం చిన్నబోతుంది.. సాహసం వెనకడుగు

వేస్తుంది.. గమ్యం నాలుగడుగులు ముం దుకొస్తుంది..!

ఆటలో.. క్రికెట్ దేవుడిని మించిన మహేంద్ర జాలం చూపిన ఇండియా

క్రికెట్ ఐకాన్ మహేంద్ర సిం గ్ ధోనీ..ఎవరెస్ట్​లా ఎదిగాడు.. శిఖరంలా

ఒదిగాడు.. గమ్యాన్ని ముద్దా డాడు.. ప్రయాణం ఆపేశాడు..!!

మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్న వేళ.. రెండు దశాబ్దా ల పాటు

యావత్ భారతావని ఆశలు మోసిన మన మహేంద్రుడు అంతర్జాతీయ

ఆటకు అల్విదా ప్రకటిం చాడు..!! ధోనీ నీడలో ఎదిగిన ఆల్ రౌండర్‌

సురేశ్‌ రైనా అల్విదాలో కూడా అతన్నే అనుసరించాడు..!!

న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు శనివారం ప్రకటించాడు. ఐపీఎల్ కోసం సి ద్ధమవుతున్న తరుణంలో అనూహ్యంగా తన రిటైర్మెంట్ ను ప్రకటించి ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ‘నా కెరీర్ ఆసాంతం మద్దతుగా నిలిచి, నన్ను అభిమానించిన వారందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్లుగా భావించండి’అని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ క్యాంప్ కోసం చెన్నైకి వచ్చిన ఓ రోజు తర్వాత ఈ నిర్ణయం రావడం గమనార్హం. గతేడాది జులై 9న న్యూజిలాండ్ తో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీస్ తర్వాత నుంచి ధోనీ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. అప్పట్నించి మహీ రిటైర్మెంట్ పై అనేక ఊహాగానాలు వచ్చినా ఏనాడూ స్పందించలేదు. అయితే అందరూ కోరుకుంటున్నట్లుగా వచ్చే ఏడాది ఇండియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడతాడని అనుకున్నా .. మహీ మాత్రం తన మన:సాక్షికే కట్టుబడ్డాడు. ఊహించని రీతిలో రిటైర్మెంట్‌ ప్రకటించి ధోనీ షాకిస్తే.. రైనా అంతకన్నా పెద్ద షాకిచ్చాడు. ధోనీ ప్రకటన వచ్చిన కొన్ని నిమిషాలకే తాను కూడా ఆట నుంచి వైదొలుగుతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు.

16 ఏళ్ల కెరీర్​..

వికెట్ కీపర్​గా కెరీర్​ మొదలుపెట్టిన ధోనీకి.. టీమిండియాతో 16 ఏళ్ల అనుబంధం ఉంది. ఈ క్రమంలో ఇండియా తరఫున 350 వన్డేలు ఆడాడు. 50.57 యావరేజ్ తో 12,303 రన్స్​ సాధించాడు. ఇందులో 10 సెం చరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్​ స్కోరు 183 *. ఒక్క వికెట్ కూడా పడగొట్టాడు. ఏడాది ఆలస్యం గా డిసెం బర్​ 2, 2005న శ్రీలంకపై తొలి టెస్ట్​ ఆడిన మహీ.. 2014, డిసెంబర్​ 26న ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్​ ఆడాడు. మొత్తం 90 టెస్ట్​ల్లో 38.09 యావరేజ్ తో 4876 రన్స్​ సాధించాడు. 6 సెంచరీలు, 53 హాఫ్ సెం చరీలు చేశాడు. ఓ డబుల్ సెం చరీ (224) కూడా ఉంది. 98 టీ20ల్లో 37.60 యావరేజ్ తో 1617 రన్స్​ సాధించాడు. తన కెరీర్​లో ఎక్కువ భాగం ఐదు, ఏడు స్థా నాల్లో బ్యాటిం గ్ చేసిన ధోనీ.. 50 యావరేజ్ తో 10,773 రన్స్ సాధించాడు.

సూపర్ కెప్టెన్ …

ఆది.. అంతం.. రనౌట్ తోనే..

డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్ పై వన్డే అరంగేట్రం చేసిన మహీ.. ఆ మ్యాచ్ లో రనౌట్ తో కెరీర్ మొదలుపెట్టాడు. సేమ్ కివీస్ తో ఆడిన ఆఖరి మ్యాచ్ లోనూ రనౌట్ తో కెరీర్ ముగించాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో ఓ ఐకాన్ గా ఎదుగుతాడని ఎవరూ ఊహించనప్పుడు ఆ రనౌట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కా నీ మొన్నటి రనౌట్ మాత్రం ప్రతి క్రికెట్ అభిమాని మదిలో అలాగే నిలిచిపోయింది. ఎందుకంటే ఆశల్లేని స్థితి నుం చి టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్ చేర్చే క్రమంలో చోటు చేసుకున్న ఆ రనౌట్ .. 130 కోట్ల మంది ఆశలను ఆడియాసలు చేసింది. మైదానంలో ధోనీ తొలిసారి కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అది ఎప్పుడూ.. ఎవరూ చూడని సంఘటన.

 

మ్యాచులు  పరుగులు  టాప్ స్కోర్  సెంచరీలు  హాఫ్ సెంచరీలు  క్యాచులు స్టంపింగ్స్​

టెస్ట్​లు   90    4876         224                 06                 33                     256     38

వన్డేలు  350    10773       183*               10                 73                     321   123

టీ20లు  98     1617           56                   0                   2                        57     34

 

ప్రతి క్రికెటర్ ఏదో ఒక రోజు తన జర్నీని ముగించి తీరాల్సిందే. కానీ మన మనసుకు దగ్గరైన వాళ్లు వీడ్కోలు పలికితే ఎక్కువ ఫీలవుతాం. నువ్వు దేశం కోసం చేసింది అందరి మనస్సుల్లో చిరస్థా యిగా నిలిచిపోతుంది. కానీ మనమిద్దరం ఒకరికొకరు ఇచ్చుకున్న గౌరవం, నువ్వు నాపై చూపించిన మమకారం ఎప్పటికీ నాలోనే ఉంటుంది. ప్రపంచం నీ ఘనతలను చూసింది. నేను నిన్ను చూశాను. అన్నింటికీ థ్యాంక్స్ మై కెప్టెన్ .. నా క్యాప్ తీసి నీకు సెల్యూట్ చేస్తు న్నా. – విరాట్ కోహ్లీ

ఓశకం ముగిసింది. ధోనీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఓ గొప్ప క్రికెటర్ . అతని లీడర్ షిప్ సామర్థ్యాన్ని మ్యాచ్ చెయ్యలేం. మరీ ముఖ్యంగా టీ20ల్లో చాలా కష్టం. కెరీర్ ప్రారంభంలో వన్డేల్లో అతను బ్యాటింగ్ చేసిన విధానంతో తన ప్రతిభ, నేచురల్ టాలెంట్ ను ప్రపంచం గుర్తించింది. ప్రతి మంచి విషయానికి ఓ ముగింపు ఉంటుంది. ఇది నిజంగా చాలా గొప్ప ముగింపు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకునే వికెట్ కీపర్లకు స్టాం డర్డ్స్ కూడా సెట్ చేశాడు. ఎలాంటి లోటు, బాధ లేకుం డా క్రికెట్ ఫీల్డ్​ను వీడుతున్నా డు. లైఫ్ లో అతనికి అంతా మంచే జరగాలి – సౌరవ్ గంగూలీ, బీసీసీఐ ప్రెసిడెంట్

అలాంటి ప్లేయర్ ఉండడం.. మిషన్ ఇంపాజిబుల్.. ధోనీ లాంటి వ్యక్తి ఇంకొకరు లేరు, ఉండరు, ఉండబోరు. ఎంతో మంది ప్లేయర్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ ధోనీలాంటి కామ్ పర్సన్ ఇంకొకరు ఉండరు. ప్రజలకు ధోనీతో ఎంత అనుబంధం ఉందంటే క్రికెట్ లవర్స్ అతన్ని కుటుంబసభ్యునిగా భావిస్తారు. ఓం ఫినిషాయ నమ: – సెహ్వాగ్

ధోనీ నువ్వు ఇండియన్ క్రికెట్ కు అందించిన సేవలు వెలకట్టలే నివి. మనం కలిసి 2011 వరల్డ్​కప్ సాధించడం నా జీవితంలోనే గొప్ప క్షణం. సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా నీకు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కు ఆల్ ద బెస్ట్​ – సచిన్ టెం డూల్కర్​

ఇండియా ఏ నుంచి మొదలుపెట్టి.. ‘ద ఇండియా’ వరకు మన ప్రయాణంలో ఎన్నో ప్రశ్నలు, కామాలు, ఖాళీలు, ఆశ్చర్యార్థకాలు. నువ్వు ఇప్పుడు ఓ చాప్టర్ కు ఫుల్ స్టాప్ పెట్టావు. అనుభవంతో చెబుతున్నా ఈ కొత్త జీవితం అంతులే ని డీఆర్ ఎస్ లతో చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా ఆడావు.. -గౌతమ్ గంభీర్​

దేశానికి అన్ని ఐసీసీ ట్రోఫీలు అందించిన నిజమైన సోల్జర్ . ఇండియన్ క్రికెట్ కు నీవు అందించిన సేవలకు థాంక్స్ -బీసీసీఐ