‘బలిదాన్ బ్యాడ్జ్’ తో మొదటి మ్యాచ్ ఆడిన ధోనీ

‘బలిదాన్ బ్యాడ్జ్’ తో మొదటి మ్యాచ్ ఆడిన ధోనీ

భారత మిలటరీపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎమ్ఎస్ ధోనీ. ప్రస్తుతం జరుగుతున్న.. ప్రపంచకప్ 2019లో  భారత్ తన మొదటి మ్యాచ్.. సౌత్ ఆఫ్రికాతో ఆడి గెలిచింది. అయితే ఆ మ్యాచ్ లో ధోనీ తన కీపింగ్ గ్లౌజ్ లపై.. మన పారా మిలటరీ కి చెందిన ‘బలిదాన్ బ్యాడ్జ్’ ను తన కీపింగ్ గ్లౌజ్ లపై అచ్చు వేయించుకుని మ్యాచ్ ఆడాడు.

ఇప్పటికే తనకు భారత మిలటరీ అంటే ఎంతో ఇష్టమని చాటుకున్నాడు ధోని. భారత ఆర్మీ ధోనీని లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాతో గౌరవించింది. ఆగ్రాలోని పారామిలటరీతో కలిసి ధోనీ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఏకంగా ఐదు సార్లు పారాచ్యూట్ జంప్ కూడా చేశాడు. పుల్వామా ఘటన జరిగినపుడు కూడా.. సహచర ఆటగాళ్లకు భారత కల్నల్ హోదాలో మిలటరీ క్యాప్ లను అందజేశాడు ధోనీ.