
చెన్నై : వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాకు దూరమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ టీ20ల ద్వారా మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటు న్నాడు. అంతేకాక కొన్నేళ్లుగా ఎంఎస్ ధోనీ పోషించిన ఫినిషర్ రోల్ కు తాను సరిపోతానని అంటున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ లో బరిలోకి దిగాలని ఆశిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన కార్తీక్ మాట్లాడుతూ.. ‘టీ20 వరల్డ్‌కప్ కు ఏడాది మాత్రమే టైమ్ ఉండడంతో డొమెస్టిక్ లెవల్ లో బాగా పెర్ఫామ్ చేస్తే గ్యారంటీగా రేసులో ఉంటా.
ఇండియా టీమ్ కు మంచి ఫినిషర్ అవసరముంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్ ల్ లో నేను ఆ పని బాగా చేశా. అయితే గత టోర్నీలు, వరల్డ్‌కప్ పెర్ఫామెన్స్ తర్వాత నన్ను టీమ్ నుంచి తప్పించారు. కానీ ఇన్నాళ్లు ధోనీ నిర్వహించిన ఫినిషర్ రోల్ కు నేను సూటవుతా. కేకేఆర్, తమిళనాడుకు ఆడిన మ్యాచ్ ల్ లో ఫినిషర్ గా నేనేంటో ఇప్పటికే చూపించా. ఒక వేళ ఆ స్థానం ఖాళీ అయితే కచ్చి తంగా నేనే రేసులో
ముందుంటా’ అని తెలిపాడు.