న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్‌మిషన్ తన రూ.3,067 కోట్ల ఐపీఓ కోసం ప్రైస్ బ్యాండ్‌ను రూ.829 నుంచి రూ.871 గా నిర్ణయించింది. ఈ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ కోసం ఆగస్టు 10న ప్రారంభమై, ఆగస్టు 12న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ఆగస్టు 7న జరుగుతుంది. షేర్ల లిస్టింగ్ ఆగస్టు 17న ఉంటుంది.
ఐపీఓలో రూ.1,400 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ, ప్రమోటర్ల నుంచి 1.91 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఉన్నాయి. అర్హులైన ఉద్యోగులకు ప్రతి షేరుపై రూ.80 డిస్కౌంట్ లభిస్తుంది. ధూత్ ట్రాన్స్‌మిషన్ 2025–-26లో రూ.4,525 కోట్ల ఆదాయంపై రూ.397 కోట్ల నికర లాభం సాధించింది. ఈ కంపెనీ వైరింగ్ హార్నెస్, సెన్సార్లు, స్విచ్‌లను తయారు చేస్తుంది.
