చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ గునుకుల లీలా జగన్మోహన్రెడ్డి ఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్నారు. గతంలో కూడా పేదింటి ఆడపిల్లకు పెళ్లి సందర్భంగా పుస్తె మట్టెలు పంపిణీ చేశారు. శుక్రవారం ధూల్మిట్ట గ్రామానికి చెందిన సుద్దాల స్వర్ణలత బాబు కూతురు మేఘనకు రూ.5వేలఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లీలా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ఆర్హలందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుషాలపురం రాజు, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, జాలపల్లి సర్పంచ్ చెట్కూరి కమలాకర్ యాదవ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెప్యాల అనిల్, వార్డు మెంబర్లు, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
