అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ మహిళా క్రికెటర్, BCC పాలకుల సభ్యురాలు డయానా ఎడ్జులీ కీ అరుదైన గౌరవం దక్కింది. భారత్,ఆస్ట్రేలియాల మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌కు ఉపయోగించే కాయిన్‌ను ఎడుల్జీ కోహ్లి చేతికి అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు ఎడ్జులీ. ఈ అవకాశం ఇచ్చిన ఇండియన్ క్రికెట్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. మహిళా క్రికెట్‌కు ఉత్సాహాన్నిచ్చేందుకు తానెప్పుడూ ముందుంటానని, దేశవ్యాప్తంగా అమ్మాయిల క్రికెట్‌కు క్రేజ్ పెరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని తెలిపారు. దేశంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎడ్జులీ రాంచీ వేదికగా తెలిపారు.

