కొడుకు డెడ్ బాడీ కోసం 8 నెలలుగా తవ్వుతున్న తండ్రి..

కొడుకు డెడ్ బాడీ కోసం 8 నెలలుగా తవ్వుతున్న తండ్రి..
  • సోల్జర్​ను చంపి, పాతేసిన టెర్రరిస్టులు
  • మృతదేహం కోసం రోజూ వెతుకుతున్న తండ్రి

శ్రీనగర్: ఆ తండ్రి రోజూ పొద్దున్నే పలుగు, పార తీసుకొని వెళ్తున్నాడు. తన ఇంటికి దగ్గర్లోని పొలాల్లో రోజంతా తవ్వుతున్నాడు. ఏమీ దొరక్కపోవడంతో.. గుండెల్లో బాధతో ఇంటికి తిరిగొస్తున్నాడు. తెల్లారి లేచాక మళ్లీ అదే పని.. ఇట్ల ఒకట్రెండు రోజులుగా కాదు.. 8 నెలలుగా తవ్వుతూనే ఉన్నాడు. పొలం పనులకోసం తవ్వడం లేదు. తన కొడుకు మృతదేహం కోసం వెతుకుతున్నాడు. కొడుకును కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు, అతడిని చంపేసి డెడ్ బాడీని ఎక్కడో పాతిపెట్టారు. కొడుకు దక్కకపోయినా, అతని డెడ్ బాడీ అయినా దక్కుతుందనే ఆశతో ఆ తండ్రి రోజూ ఇట్ల తవ్వుతున్నాడు. ఈ హృదయ విదారక ఘటన జమ్మూకాశ్మీర్ లో జరిగింది. చనిపోయిన కొడుకుకు గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలని తపిస్తున్న ఆ తండ్రి కథ ఇది... 

డపోయినేడాది ఆగస్టు 2న ఈద్ సందర్భంగా ఇంటికొచ్చిన షకీర్.. ఆ రోజు మధ్యాహ్నం కుటుంబసభ్యులతో కలిసి లంచ్ చేశాడు. ఆ తర్వాత బయటకు వెళ్లిన షకీర్.. ఓ గంటకు ఇంటికి ఫోన్ చేశాడు. ‘‘నేను ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్తున్నాను. ఒకవేళ ఆర్మీ అధికారులు అడిగితే చెప్పకండి” అని ఇంట్లొళ్లకు చెప్పాడు. అయితే ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఆ తర్వాతి రోజు కుల్గంలో షకీర్ వెహికల్ పూర్తిగా కాలిపోయి కనిపించింది. పోలీసులు మిస్సింగ్ కేసు పెట్టి, దర్యాప్తు చేపట్టారు. వారం తర్వాత షకీర్ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో రక్తంతో తడిసిన అతని బట్టలు దొరికాయి. దీంతో షకీర్ ను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని కుటుంబసభ్యులకు అర్థమైంది. కానీ పోలీసులు మాత్రం అతడు చనిపోయినట్లు ప్రకటించలేదు.  

అంత్యక్రియలైనా చేయాలని..

షకీర్ అదృశ్యమైన కొన్నిరోజులకు సోషల్ మీడియా లో ఓ ఆడియో క్లిప్ వైరల్ అయింది. ‘షకీర్​ను చంపేశాం. మిలిటెంట్ల డెడ్ బాడీలను వాళ్ల ఫ్యామిలీలకు పోలీసులు అప్పగించట్లేదు. అందుకే మేం కూడా షకీర్ డెడ్ బాడీని అప్పగించట్లే’ అని టెర్రరిస్టులు స్పష్టంచేశారు. ఇక అప్పటి నుంచి మంజూర్ తన కొడుకు డెడ్ బాడీ కోసం వెతకడం ప్రారంభించాడు.