డిజిటల్ జనగణనకు ఏర్పాట్లు పూర్తి : ములుగు కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవ రావు

డిజిటల్ జనగణనకు ఏర్పాట్లు పూర్తి : ములుగు కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవ రావు

ములుగు, వెలుగు : జిల్లాలో జనగణనను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో జనగణనపై కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ద్వారా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని ప్రజలను కోరారు. మొదటి దశ హౌస్ లిస్టింగ్ లో స్వీయ గణన మే10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 807 హౌస్ లిస్టింగ్ బ్లాకులు గుర్తించామని, ప్రతి బ్లాక్‌‌‌‌‌‌‌‌లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని వివరించారు. 

ఈ ప్రక్రియ కోసం 545మంది ఎన్యుమరేటర్లు, 97 మంది సూపర్వైజర్లను (రిజర్వ్‌‌‌‌‌‌‌‌తో సహా) నియమించామని తెలిపారు. స్వీయ నమోదు కోసం se.census.gov.in లో కుటుంబంలోని ఒక సభ్యుడు లాగిన్ అయి వివరాలు నమోదు చేయవచ్చని తెలిపారు. నమోదు చేసిన మొబైల్ నంబర్‌‌‌‌‌‌‌‌కు 11అంకెల సంఖ్య వస్తుందని, ఆ సంఖ్యను ఎన్యుమరేటర్‌‌‌‌‌‌‌‌కు అందజేయాలని తెలిపారు. ఏవైనా తప్పులు ఉంటే ఎన్యుమరేటర్ ద్వారా మాత్రమే సవరించుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ప్రజల మధ్య మీడియా వారధిగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ సీహెచ్.మహేందర్ జి, డీపీఆర్వో రఫిక్, కలెక్టరేట్ జనగణన పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.