మోడీ పాలనలో పేదరికం పెరిగిపోయింది:దిగ్విజయ్ సింగ్

మోడీ పాలనలో పేదరికం పెరిగిపోయింది:దిగ్విజయ్ సింగ్

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దేశంలో హింసను, ద్వేషాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. నోట్ల రద్దుతో సాధించింది ఏంటో ప్రధాని ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మోడీ ఎకనామిక్ పాలసీతో  దేశం దివాళా తీసిందని ఆరోపించారు. బీజేపీ పాలనలో పేదరికం పెరిగిపోయిందన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 

కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం తమ స్వార్థం కోసం వినియోగించుకుంటుందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఈడీ, సీబీఐ దాడులతో నిర్దోషులను కేసుల్లో ఇరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఛార్జీషీట్లు వేయకుండానే నెలల తరబడి జైలులో ఉంచుతున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసుల్లో ఇరికించి బెయిల్ రాకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. మోడీ విధానాలు సంపన్నులకు ప్రయోజనాలు కలుగుతున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కేంద్రం కరోనా పేరుతో కుట్ర చేస్తుందని ఆరోపించారు.