కాంగ్రెస్ అధ్యక్ష పోటీ నుంచి దిగ్విజయ్ ఔట్

కాంగ్రెస్ అధ్యక్ష పోటీ నుంచి దిగ్విజయ్ ఔట్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. మల్లిఖార్జున్ ఖర్గేకు మద్ధతుగా ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. ‘‘మల్లిఖార్జున్ ఖర్గే మా నాయకుడు. ఆయనపై పోటీ చేయను. ఆయనకు ప్రతిపాదకుడిగా వ్యవహరిస్తాను’’ అని తెలిపారు. మరోవైపు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఖర్గేకు మద్ధతు పలికారు. ఖర్గేకు తానే ప్రతిపాదకుడిగా ఉంటానని తెలిపారు.

మధ్యాహ్నం ఖర్గే నామినేషన్ వేయనున్నారు. గాంధీ ఫ్యామిలీతో పాటు కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఖర్గేకు మద్ధతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ తప్పుకోవడంతో ఖర్గే శశిథరూర్ మధ్యే పోటీ ఉండనుంది. ఖర్గేను ఏకగ్రీవం చేసేందుకు థరూర్ నామినేషన్ వేయకపోవచ్చనే ప్రచారం జరిగింది. దీనిని థరూర్ ఖండించారు. పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. 

వాస్తవానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష రేసులో ముందుండగా.. ఆయన వర్గ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే జీ 23 నేతల్లో ఒకరైన ముకుల్ వాస్నిక్ సైతం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.