కింద పడిపోయిన దిగ్విజయ్ సింగ్.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కాంగ్రెస్

 కింద పడిపోయిన దిగ్విజయ్ సింగ్..  రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కాంగ్రెస్

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పడిపోయారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో కొనసాగుతోంది. టీ బ్రేక్ టైమ్ లో  రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్ వైపు వెళ్తుండగా జరిగిన స్వల్ప తోపులాటలో దిగ్విజయ్ సింగ్ కింద పడిపోయారు. వెంటనే అక్కడున్న మద్దతుదారులు ఆయనను పైకి లేపారు. ఈ ఘటన రాష్ట్ర రహదారుల పరిస్థితిపై కాంగ్రెస్ , బీజేపీ మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసందర్భంగా మండిపడ్డారు.  

రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, దిగ్విజయ సింగ్ ఇప్పటివరకు నాలుగుసార్లు కింద పడిపోయారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీడియా ఇన్‌ఛార్జ్  జైరాంరమేష్ అన్నారు. అయితే దీనిపైన  బీజేపీ లీడర్ నరేంద్ర సలుజా ట్వీట్ చేస్తూ... రోడ్ల పరిస్థితి కంటే కాంగ్రెస్ కార్యకర్తలు నెట్టివేయడం వల్లే దిగ్విజయ్ సింగ్ పడిపోయారని వ్యాఖ్యానించారు.