టాప్‌‌ ప్లేస్‌‌లో దీక్షిత, ధరణి

టాప్‌‌ ప్లేస్‌‌లో దీక్షిత, ధరణి

హైదరాబాద్‌‌, వెలుగు : హుస్సేన్​సాగర్‌‌లో జరుగుతున్న వైఏఐ మాన్‌‌సూన్ రెగట్టా నేషనల్ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్‌‌షిప్​లో టాప్‌‌ ప్లేస్‌‌లో దీక్షిత, ధరణి.  రెండో రోజు, బుధవారం జరిగిన అండర్-19 ఇంటర్నేషనల్ 420 క్లాస్  కేటగిరీ రేసుల్లో యాచ్‌‌ క్లబ్‌‌ ఆఫ్‌‌ హైదరాబాద్‌‌ (వైసీహెచ్‌‌)కు చెందిన ధరణి, ఎన్‌‌బీఎస్సీ గోవాకు చెందినమల్లేష్ జంట 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

అండర్-15 ఆప్టిమిస్టిక్ క్లాస్ గర్ల్స్‌‌ కేటగిరీలో వైసీహెచ్ సెయిలర్ దీక్షిత 28 పాయింట్లతో టాప్‌‌ప్లేస్‌‌లో కొనసాగుతోంది. ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ మధ్యప్రదేశ్‌‌కు చెందిన ఏకలవ్య బాథమ్ బాయ్స్‌‌ కేటగిరీలో 9 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు.