
లండన్/ న్యూఢిల్లీ: టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రిత్ బుమ్రాను జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇంగ్లండ్ టూర్ లో మూడు టెస్టుల కోటా పూర్తి కావడంతో అతన్ని శుక్రవారం (ఆగస్టు 01) బాధ్యతల నుంచి తప్పించారు. అయితే రాబోయే రోజుల్లో బుమ్రా ఏ ఫార్మాట్ లో ఆడతాడనే చర్చ అప్పుడే మొదలైంది. ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడిన 31 ఏళ్ల బుమ్రా 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 వికెట్లు తీశాడు. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్ట్. లార్డ్స్ లో ఆడిన మూడో టెస్ట్ లో బుమ్రా రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
అయితే మాంచెస్టర్ మ్యాచ్ లో మాత్రం తన కెరీర్లోనే తొలిసారి ఒకే ఇన్నిం గ్స్ లో వంద కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. ఓవరాల్ టెస్ట్ కెరీర్లో 48 మ్యాచ్లు ఆడిన బుమ్రా 219 వికెట్లు తీశాడు. అయితే ఇంగ్లండ్ ఐదో మ్యాచ్లో బుమ్రా ఆడకపోవడంతో అతని టెస్ట్ భవిష్యత్తుపై అనేక సందేహాలు మొదలయ్యాయి. గాయంతో బాధపడుతున్న అతని శరీరాన్ని పరిశీ లిస్తే భవిష్యత్ లో బుమ్రా ఐదు మ్యాచ్ ల సిరీస్ కు పూర్తిగా అందుబాటులో ఉండే అవకాశం చాలా తక్కువ. ఇప్పట్లో ఇండియాకు ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లేదు. 2027 ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. మరి అప్పటి వరకు అతని కెరీర్ ఎటు వైపు మలుపు తీసుకుంటుందో చూడాలి.
ఆసియా కప్ లో ఆడతాడా?
టీమిండియా తర్వాతి ఇంటర్నేషనల్ అసైన్మెంట్ టీ20 ఆసియా కప్. ఇందులో బుమ్రా ఆడతాడా? ఇది ముగిసిన వెంటనే వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ రెండింటిలో బుమ్రా ఎందులో బరిలోకి దిగుతాడో చూడాలి. సెప్టెంబర్ 29న ఆసియా కప్ ముగిసిన వెంటనే.. అక్టోబర్ 2న అహ్మదాబాద్ లో విండీస్తో తొలి టెస్ట్ మొదలవుతుంది. అక్టోబర్ 10-14వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్లో సౌతా ఫ్రికాతో రెండు టెస్ట్ లు ఉంటాయి.
ఆసియా కప్ ఆడతాడా? విండీస్ లో టెస్ట్ సిరీస్ లో పాల్గొంటాడా? ఈ నిర్ణయం చాలా క్లిష్టమైంది. కానీ బుమ్రా టెస్ట్ క్రికెట్ ను ఎక్కువగా ఇష్టపడతాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్లు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. టీ20ల్లో ఆడాలనుకుంటే జనవరిలో న్యూజిలాండ్ తో జరిగే సిరీస్లో బరిలోకి దిగొచ్చు. ఇదిటీ 20 వరల్డ్ కప్ కు డ్రెస్ రిహార్సల్ అవుతుంది. ఒకవేళ బుమ్రా ఆసియా కప్లో ఆడి టీమిండియా ఫైనల్ కు చేరితే అతను అహ్మదాబాద్ లో విండీస్ టెస్ట్ మ్యాచ్ ఆడలేడు. విండీస్ పై బుమ్రా అవసరం లేదనుకుంటే ఆసియా కప్ అడి ఆ తర్వాత నేరుగా సౌతాఫ్రికాతో జరిగే సిరీస్లో పాల్గొంటాడు. దీనిపై గంభీర్, అజిత్ అగార్కర్ బృందం నిర్ణయం తీ సుకోవాల్సి ఉంటుంది' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించాడు.
పని భారాన్ని బట్టే..
ఇంగ్లండ్ టూర్ లో పని భారాన్ని పరిగణనలోకి తీసుకునే బుమ్రాను మూడు టెస్టులోనే ఆడించామ ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్ అన్నాడు. ఈ విషయాన్ని అందరూ గౌరవించాలన్నాడు. బుమ్రా లాంటి ప్లేయరు బెంచ్ కు పరిమితం చేయడం చాలా కఠినమైన నిర్ణయమని చెప్పాడు. ఐదో టెస్ట్లో బుమ్రా ఆడతాడని చివరి నిమిషం వరకు భావించినా.. కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ విశ్రాంతికే మొగ్గారు. 'బుమ్రా అంశంలో ఇది చాలా క్లిష్టమైన సమస్య. అతన్ని ఆడించాలని మేం భావించినా శరీరాన్ని కూడా గౌరవించాలి. దాని ఆధారంగా అతన్ని జట్టులోకి తీసుకోలేదు. ఈ నిర్ణయం విలు వైనదిగా మేం భావించాం.
బుమ్రా మూడు టెస్ట్ లో చాలా ఓవర్లు బౌలింగ్ చేశాడు. మాంచెస్టర్లో ఒక ఇన్నింగ్స్ లోనే బౌలింగ్ చేశాడు. కానీ పని భారం మాత్రం చాలా ఎక్కువైంది. అందుకే టూరు ముందు చెప్పినట్లుగా మూడు టెస్ట్లు మాత్రమే ఆడించాం' అని డస్కెట్ పేర్కొన్నాడు. ఓవల్ పిచ్పి పచ్చిక ఎక్కువగా ఉండటం వల్ల బుమ్రా కచ్చితంగా ప్రభావం చూపేవాడన్నాడు.