- కొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సంస్థ రిచ్
హైదరాబాద్, వెలుగు: ఆస్పత్రుల్లో వర్క్‌ఫ్లో, ఇప్పటివరకు గుర్తించని అవసరాలు, ఆస్పత్రుల్లో అవసరమైన పరికరాల తయారీ వంటివాటిపై డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు, రీసెర్చర్లు, ఇండస్ట్రీ ప్రతినిధులకు మెరుగైన అవగాహన కల్పించేలా రీసెర్చ్ ఇన్నొవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్).. తెలంగాణ హాస్పిటల్ ఇండ స్ట్రీ ఇన్నొవేషన్ బ్రిడ్జ్(టీహెచ్ఐఐబీ)ని ఆవిష్కరించింది.
ఈ సరికొత్త కార్యక్రమం ఆస్పత్రుల ప్రతినిధులు, ఇండస్ట్రీ ప్రతినిధుల మధ్య సరికొత్త వారధిలా ఇది పనిచేయనుంది. బయో ఏషియా సదస్సు వేదికగా ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. పైలట్ ఫేజ్‌లో భాగంగా కొన్ని సంస్థలను ఎంపిక చేసి వారికి.. నాలుగు కీలకాంశాలపై అవగాహన కల్పించనున్నారు.
స్టార్టప్స్, రీసెర్చర్లు, ఇండస్ట్రీ ప్రతినిధులు.. హాస్పిటల్ వర్క్ఫ్లోస్, ఆస్పత్రుల్లో ఇప్పటిదాకా గుర్తించని అవసరాలు వంటి వాటిపై అవగాహన కల్పించనున్నారు. రెండో అంశంలో మెడ్‌టెక్ పరికరాలు, ఆర్ అండ్ డీ సెంటర్లు, రెగ్యులేటరీ ప్రాసెస్ వంటివాటిపై డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లకు అవగాహన కల్పిస్తారు. సామర్థ్యాలను మరింత పెంచుకునేలా వర్క్‌షాప్‌ల నిర్వహణ, రెగ్యులేటరీ గైడెన్స్, పేటెంట్ హక్కులపై సలహాలు సూచనలు ఇస్తుంటారు.
