ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..కొత్తపేటలో 11 తులాల బంగారం, రూ,2 లక్షలు, 2 కిలోల వెండి చోరీ

ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..కొత్తపేటలో 11 తులాల బంగారం, రూ,2 లక్షలు, 2 కిలోల వెండి చోరీ

దిల్‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: వ్యక్తిగత పనుల కోసం ఓ కుటుంబం స్వ్రగామానికి వెళ్లి వచ్చేసరికి వారి ఇంట్లో చోరీ జరిగింది. సీఐ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట డివిజన్ మోహన్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని బృందావనం అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పాలెం అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 9న స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామానికి వ్యక్తిగత పనులపై కుటుంబ సభ్యులతో వెళ్లాడు. 

తిరిగి ఈ నెల 13న సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.50 లక్షల నగదు, 2 కిలోల వెండి వస్తువులతో పాటు ఇతర విలువైన వస్తువులను అపహరించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.