ప్రస్తుతం హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఇటు ఇండస్ట్రీలో, అటు మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో జరిగిన వివాదంతో కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది డింపుల్. ఈ వ్యవహారంతో డింపుల్ చాలా అప్‌సెట్ అయినట్లు తెలుస్తుంది. కనీసం బయటకు రావడానికి కూడా ఇష్టపడటం లేదని స్వయంగా డింపుల్ తరుపు న్యాయవాది పేర్కొన్న సంగతి తెలిసిందే.
అసలే వరుస డిజాస్టర్లతో ఫుల్ డిజపాయింట్ లో ఉన్న డింపుల్.. తాజా ఇష్యూతో మరింత అప్సెట్ అయ్యిందట. అంతేకాదు, ఇష్యూ కారణంగా తన బాయ్ ఫ్రెండ్ మ్యాటర్ బయటకు వచ్చిందని ఫీలవుతుందట. విక్టర్ డేవిడ్ అనే వ్యక్తితో డింపుల్ కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. చాలా కాలంగా ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. కానీ ఇన్నిరోజులు ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
కానీ.. డీసీపీతో జరిగిన గొడవలో డింపుల్ బాయ్‌ఫ్రెండ్ మ్యాటర్ లీక్ అయ్యింది. ఇప్పుడు ఇదే విషయంపై డింపుల్ చాలా అసహనంగా ఉందట.ఇక డింపుల్ హయతి, విక్టర్ డేవిడ్ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని సమాచారం. అతను గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కలిగిన స్నేహం ప్రేమగా మారి.. ఇప్పుడు లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారు.