కనీసం సెన్స్‌ లేకుండా.. రివ్యూ రైటర్ లపై అజయ్ షాకింగ్ కామెంట్స్

కనీసం సెన్స్‌ లేకుండా.. రివ్యూ రైటర్ లపై అజయ్ షాకింగ్ కామెంట్స్

టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaaram). రూరల్ హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. రోజురోజుకి పెరుగుతున్న కలెక్షన్స్ చూసి మేకర్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇందులో భాగంగా తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకునేందుకు మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. 

ఏ ఈవెంట్ లో భాగంగా మేకర్స్ ఆడియన్స్ కు, మీడియాకి కృతజ్ఞతలు చెప్పారు. అయితే మంగళవారం సినిమా రివ్యూ రాసిన కొంతమందిపై షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం సినిమాను 
ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. రివ్యూలు రాసిన మీడియాకు, యూట్యూబ్ చానెల్స్ కు, ట్విట్టర్‌ పేజ్ వాళ్లకి కూడా నా కృతజ్ఞతలు. నేను ఏదైతే ముందు నుండి ఏదైతే రిక్వెస్ట్ చేశానో ట్విస్ట్ లు, క్యారెక్టర్స్ రివీల్ చేయకండి అని.. నా మాటని గౌరవిస్తూ ఎలాంటివి లీక్ చేయనందుకు థాంక్స్.

కానీ ఓ వ్యక్తి ఉన్నాడు. తాను సీనియర్‌ అని చెప్పుకుంటాడు. అతను కనీసం సెన్స్‌ లేకుండా పేపర్‌ పట్టుకుని సినిమా కథ మొత్తం చదివి వినిపిస్తాడు. సినిమా నచ్చడం, నచ్చకపోవటం వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని మేము తప్పుపట్టడంలేదు. ఇలా ఒకరిద్దరు తప్పితే.. మిగిలిన అందరూ మా సినిమా గురించి చాలా బాగా రాశారు.. అని చెప్పుకొచ్చారు అజయ్. ప్రస్తుతం అజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.