
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ తో పుష్ప 2 చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలున్న ఈ సినిమా ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15న విడుదల అవుతుంది అని అందరు భావించారు. కానీ, అనూహ్యంగా ఈ సినిమా డిసెంబర్ కు వాయిదా పడింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. ఈ షాక్ నుండి కోలుకునేలోపే మరో షాక్ తగిలింది ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.
అదేంటంటే.. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ లెవల్లో ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్ కూడా నడిచింది. ఈ ప్రాజెక్టుపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వేళ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు అట్లీ.
షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా చేసి వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఈ దర్శకుడు తన తరువాతి సినిమా కోసం మరోసారి బాలీవుడ్ స్టార్ ని సెలెక్ట్ చేసుకున్నాడట. ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అవును.. ఇటీవల సల్మాన్ ఖాన్ ను కలిసిన దర్శకుడు అట్లీ ఆయన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యేలా అదిరిపోయే కథను వినిపించాడట. దానికి సల్మాన్ ఖాన్ వెంటనే ఒకే చెప్పేశారని టాక్. ప్రస్తుతం సల్మాన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవగానే ఈ సినిమా మొదలవనుందట. అలా అల్లు అర్జున్ తో సినిమా అనుకున్న అట్లీ సల్మాన్ ను సెట్ చేసుకున్నాడు. మరి బన్నీ నెక్స్ట్ సినిమాతో ఎవరితో ప్లాన్ చేస్తాడా అనేది చూడాలి.