
ఇన్ సెప్షన్, ఇంటర్ స్టెల్లర్, టెనెట్ లాంటి ఇంటెలెక్చువల్ సినిమాలతో భారీ విజయాలు అందుకున్న డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్.. ప్రస్తుతం ‘ఓపెన్‌హైమర్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విధ్వంసానికి కారణమైన న్యూక్లియర్ వెపన్‌ను కనిపెట్టిన ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఓపెన్‌హైమర్ పాత్రలో సిలియన్ మర్ఫీ నటిస్తున్నారు.
రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్, రమీ మలెక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇదో పీరియాడిక్ మూవీ. అణు బాంబు తయారీలో హైమర్ ఎదుర్కొన్న స్ట్రగులే మూవీ మెయిన్ కాన్సెప్ట్ అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఎంత కష్టమైన సీన్ అయినా గ్రాఫిక్స్ కాకుండా రియలిస్టిక్‌గా తీయడానికి ఇష్టపడే నోలన్.. ఇందులో అణుబాంబుకు సంబంధించిన సీన్స్‌ను కూడా విఎఫ్‌ఎక్స్ వాడకుండా రియల్‌గా తీస్తుండడం విశేషం. వచ్చే ఏడాది జులై 21న సినిమా విడుదల కానుంది.