Devara: ఇదంతా నా తారక్ అన్న ప్రేమ కోసం..ఎస్ ఎస్ కార్తికేయ తాజా పోస్ట్

Devara: ఇదంతా నా తారక్ అన్న ప్రేమ కోసం..ఎస్ ఎస్ కార్తికేయ తాజా పోస్ట్

జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్  వేయికళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.దేవర నుంచి వచ్చిన గ్లింప్స్, ఫియర్ సాంగ్ ఆడియన్స్ లో పీక్ లెవల్లో అంచనాలు పెంచేశాయి.

'రాకే ఎగబడి రాకే..దూకే ధైర్యమా జాగ్రత్త' అంటూ సినీ ఫ్యాన్స్ లో ఓ ఫియర్ ఏరా క్రియేట్ చేశాడు. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటంతో అదిరిపోయే బిజినెస్ చేస్తూ వెళ్తోంది. అయితే, దేవర తో డీల్ చేయడానికి పోటీ తీవ్ర స్థాయిలో నెలకొంది. ఈ మేరకు దేవర థియేట్రికల్ రైట్స్ కోసం మూడు ప్రముఖ సంస్థలు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ఆయిన సితార ఎంటెర్టైనమెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ రేట్ కు కొనుగోలు చేసాడు. అలాగే మరోవైపు దేవర కర్ణాటక థియేట్రికల్ రైట్స్ కూడా డీల్ క్లోజ్ చేశారు దేవర నిర్మాతలు. కన్నడ  థియేట్రికల్ రైట్స్ ను దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ కన్నడ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ KVN ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేసాడు. ఈ మేరకు ఎస్ ఎస్ కార్తికేయ ట్విట్టర్ X ద్వారా తనదైన శైలిలో పోస్ట్ చేశాడు. 

ALSO READ | Naveen Polishetty: బాధపడుతూనే..ఫ‌న్నీ వీడియోతో హెల్త్ అప్డేట్ ఇచ్చిన హీరో న‌వీన్ పోలిశెట్టి

"(ఎన్టీఆర్) అతని కోట..అతని ఎదుగుదల..అతని విజయం..అంటూ దేవరపై హైప్ పెంచగా..ఇదంతా నా తారక్ అన్న ప్రేమ కోసం" అంటూ తెలిపాడు. అలాగే కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని ఎస్ ఎస్ కార్తికేయ అన్నారు. 

ఇప్పటికే దేవర పార్ట్-1కు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తయింది. యువసుధ క్రియేషన్స్(Yuvasuda creations) అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్(Ntr arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా దేవర నుంచి ఆగస్టు 5న సెకండ్ సింగిల్‌‌ రిలీజ్ కానుంది.