త్రివిక్రమ్ వచ్చాక కథ మొత్తం మారిపోయింది : సముద్రఖని

త్రివిక్రమ్ వచ్చాక కథ మొత్తం మారిపోయింది : సముద్రఖని

తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samuthirakani) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro). మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai dharam tej) ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మేకర్స్. 

ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బ్రో సినిమా దర్శకుడు సముద్రఖని. ఈ ఇంటర్వ్యూలో బ్రో సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈక్రమంలో యాంకర్.. బ్రో సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది, అది పవన్ కళ్యాణ్ వరకు ఎలా వెళ్ళింది అని అడిగారు. దానికి సమాధానంగా సముద్రఖని మాట్లాడుతూ.. బ్రో సినిమా తమిళంలో వచ్చిన వినోదయ సీతమ్(Vinodaya seetham) సినిమాకు రీమేక్. అది ఒక 100 మినిట్స్ మాత్రమే ఉండే కథ. ఆ సినిమా రిలీజ్ టైంకు నేను తెలుగులో భీమ్లా నాయక్(Bheemla nayak) సినిమా చేస్తున్నాను. 

ALSO READ :హిడింబ ఒక కొత్త ప్రపంచం.. ఎర్రచొక్కా వేసుకోవాలంటే వణుకుపుట్టుద్ది

ఒక సందర్భంలో దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) దగ్గర వినోదయ సీతమ్ గురించి ప్రస్తావన వచ్చింది. దాంతో రెండు నిమిషాల్లో ఆయనకు ఈ కథ చెప్పాను. ఆయనకు కథ బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే ను సెట్ చేసి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలు, ఈ సినిమాను మనం తెలుగులో రీమేక్ చేస్తున్నాం అని చెప్పారు. అలా రెండు నిమిషాల్లోనే కథ మొత్తం మారిపోయి బ్రో సినిమా సెట్ అయ్యింది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సముద్రఖని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.