
యంగ్ హీరో అశ్విన్ బాబు(Aswin babu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ హిడింబ(Hidimba). అనీల్ కనెగంటి(Aneel kaneganti) తెరకెక్కించిన ఈ సినిమాలో ఎక్కడికిపోతావు చిన్నవాడా(Ekkadikipothavu chinnavaada) ఫేమ్ నందిత శ్వేత(Nanditha shwetha) హీరోయిన్ గా నటించింది. క్రైమ్, హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరెకెక్కుతున్న ఈ సినిమా.. జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే హిడింబ నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. తాజాగా జులై 18న ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు మేకర్స్. ఈ ప్రీమియర్ షో కి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ALSO READ :త్రివిక్రమ్ వచ్చాక కథ మొత్తం మారిపోయింది : సముద్రఖని
ఇక సినిమా చూసిన అందరినుండి ఒకేమాట వినిపిస్తోంది అదే.. హిడింబ సినిమా సూపర్ హిట్ అని. సినిమాలో ఒక్కో సీన్, ఒక్కో షాట్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయంటూ చెప్తున్నారు. అంతేకాదు సినిమాలో కొన్ని సీన్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయని, ఆ షాట్స్ వెన్నులో వణుకుపుటండం ఖాయమని చెప్తున్నారు. మరో కొంతమందేమో.. హిడింబ సినిమా అనేది ఒక కొత్త ప్రపంచం అని, ఎరుపుచొక్కా వేసుకోవాలంటే వణుకు పుట్టుద్దని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మొత్తానికి హిడింబ ప్రీమియర్స్ కు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వస్తోంది. మరి సినిమా రిజల్ట్ ఏంటి? హిడింబ సినిమాతో అశ్విన్ బాబుకు హిట్ పడిందా అనేది తెల్సుకోవాలంటే జులై 20 వరకు ఆగాల్సిందే.