ప్రపంచ శాంతి కోసం 400 కి.మీ యాత్ర

ప్రపంచ శాంతి కోసం 400 కి.మీ యాత్ర

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌కు చెందిన 60 మంది బౌద్ధ భిక్షువులు చేపట్టిన పాదయాత్రలో దర్శకుడు సత్యారెడ్డి పాల్గొన్నారు. కర్ణాటకలోని స్వర్ణభూమి నుంచి తెలంగాణలోని నాగార్జున సాగర్ వరకు సాగుతున్న ఈ 400 కి.మీ. యాత్రలో భాగంగా, హైదరాబాద్ నుండి తుర్కయాంజిల్ వరకు 17 కిలోమీటర్ల దూరం చిత్ర యూనిట్‌‌‌‌తో కలిసి ఆయన నడిచారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు సత్యారెడ్డిని ఆశీర్వదించి, బుద్ధుడి లాకెట్‌‌‌‌ను బహూకరించారు.

ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ ‘అమెరికాలో ప్రారంభించిన ‘కింగ్ బుద్ద’ హాలీవుడ్‌‌‌‌ చిత్రాన్ని పది దేశాల్లో షూటింగ్ చేశాం. మరో పదిహేను బౌద్ధ దేశాల్లో షూటింగ్ చేయాల్సి ఉంది. జాతీయ, అంతర్జాతీయ నటులు ఇందులో నటిస్తున్నారు’ అని చెప్పారు.