
రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా బి సోముసుందరం దర్శకత్వంలో మాధవన్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘కాప్’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సోముసుందరం మాట్లాడుతూ ‘పొలిటికల్ సెటైర్స్‌తో పాటు సమాజానికి ఉపయోగపడే మంచి సందేశం ఉంటుంది.
అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో నటించిన హీరోలు నిఖిల్, రాజశేఖర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్స్ చేశాం. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఎక్సయిటింగ్‌గా రూపొందించారు. ఈ సినిమాతో మా అందరికీ మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత చెప్పారు.