
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్థార్ మహేష్ బాబుతో అవడంతో ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఒక్కటి సెట్ చేస్తున్నారు మేకర్స్.
ప్రస్తుతం ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.సాధారణంగా రాజమౌళి తన ప్రీవియస్ సినిమాలకు మాదిరిగా షూటింగ్ కి ముందే మహేష్ మూవీ థీమ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. షూటింగ్ ఎలా జరగబోతుంది? అనే విషయాలు చెప్పబోతున్నాడు.
అంతేకాకుండా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కథ, అందులోని పాత్రలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన వివరాలను సంక్షిప్తంగా చెబుతారట రాజమౌళి.
ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌ను కూడా షురూ చేసినట్లు టాక్. త్వరలో ప్రెస్‌మీట్ పెట్టి వీడియోని రిలీజ్ చేస్తారా? లేదా మరేదైనా స్పెషల్ అకేషన్ చూసుకుని వివరాలు చెప్తారా అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.ఇప్పటికే మహేశ్ లుక్‌కు సంబంధించిన స్కెచ్‌లు పూర్తవగా, వాటిల్లో ‘ది బెస్ట్’ను రాజమౌళి, ఆయన టీమ్ సెలక్ట్ చేసి, ఫైనల్ చేయనున్నట్లు సినీ సర్కిల్ లో వినిపిస్తోంది.