
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన చిత్రం ‘ఓజీ’. డీవీవీ దానయ్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య గురువారం ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ ‘ఈ కథకి ఇంతటి భారీతనం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మొదటగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఆయనకు వీరాభిమానిని.
‘జానీ’ సినిమా నుంచి ఆయన్ను కలిస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం, దానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. తమన్ గారు, నవీన్ నూలి గారు, రవి చంద్రన్ గారు ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు లాంటివారు. వారి వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది’ అని అన్నాడు. ‘ఓజీ’ సినిమాని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారని, డీవీవీ బ్యానర్‌లో తనకి రెండో విజయం దక్కడం సంతోషంగా ఉందని హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ చెప్పింది.
‘ఓజీ’ చిత్రం అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని నిర్మాత దానయ్య అన్నారు. సినిమా సక్సెస్‌పై ముందునుంచీ నమ్మకంగా ఉన్నామని, ఇది అభిమానుల విజయం అని తమన్ అన్నాడు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో భాగమవడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత నాగ వంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కళ్యాణ్ దాసరి, ఎడిటర్ నవీన్ నూలి తదితరులు పాల్గొని సినిమాకి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఓజీ టెక్నీకల్ అంశాలు:
ఓజీ మూవీకి టెక్నీకల్ అంశాలు సినిమా స్థాయిని పెంచాయి. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాలు ఓజీ సినిమాకి బలాన్ని అందించాయి. ఈ విభాగాల పనితీరే ఓజీ క్వాలిటీ, ఎలివేషన్ విషయాల్లో ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. తనదైన మ్యూజిక్ టోన్తో, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో గూస్బంప్స్ కలిగేలా చేశాడు
ఆ తర్వాత ఇండియాస్ టాప్ క్రియేటివ్ టెక్నీషియన్స్ అయిన రవి కె.చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక మూడో విభాగం ఎడిటింగ్.. ఓజీ విషయంలో కీలక రోల్ ప్లే చేసింది. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ తన కత్తెరతో సినిమాకి అర్ధం తీసుకొచ్చాడు.
ఓజీ కలెక్షన్లు:
‘ఓజీ’ బుధవారం ప్రీమియర్స్ మరియు డే 1 గురువారం (Sept25) వసూళ్లు కలుపుకుని రూ. 91 కోట్ల నెట్ చేసింది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే తెలుగులో రూ.20.25 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో 2025లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా ఓజీ నిలిచింది.