‘ఓయ్ ఇడియట్’ యూనిట్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ విషెస్

‘ఓయ్ ఇడియట్’ యూనిట్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ విషెస్

‘ఓయ్ ఇడియట్’ మూవీ యూనిట్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ విషెస్ తెలిపారు. సహస్ర మూవీస్, హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సత్తిబాబు బాబు మోటూరి, శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్నారు. ఇందులో యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో వెంకట్ కడలి యువ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. 

యంగ్ టీమ్ కలిసి చేసిన ఓయ్ ఇడియట్ ట్రైలర్ ఫ్రెష్ గా ఉందని, టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. ఇలాంటి కొత్త నటీనటులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి ఎందరో రావాలన్నారు. ‘ఓయ్ ఇడియట్’ పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 


నటీనటులు : యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్

సాంకేతిక నిపుణులు : బ్యానర్: సహస్ర మూవీస్ & హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: సత్తిబాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి
డైరెక్టర్: వెంకట్ కడలి
మ్యూజిక్: జికెవి
ఎడిటర్: నాని కాసరగడ్డ
కెమెరామెన్: సతీష్ నాయక్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మేకర్స్ మైండ్ & అవినాష్ కాకినాడ
బిజినెస్ హెడ్: సౌత్ స్క్రీన్స్ మీడియా వర్క్స్ ప్రవేట్ లిమిటెడ్