జూబ్లీహిల్స్లో దేశ ద్రోహులు.. షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు తేజ

జూబ్లీహిల్స్లో దేశ ద్రోహులు.. షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు తేజ

టాలీవుడ్ దర్శకుడు తేజ(Teja) షాకింగ్ కామెంట్స్ చేశారు. నవంబర్ 30 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా జూబ్లీహిల్స్లో దేశ ద్రోహులున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ అండ్ రాజకీయ వర్గాల్లో చర్చనియ్యాంశం అయ్యాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దర్శకుడు తేజ చేసిన కామెంట్స్ గురించే చర్చ నడుస్తోంది. మరి తేజ జూబ్లీహిల్స్లో దేశ ద్రోహులు ఉన్నారని ఎందుకు అన్నారు? ఎవరి గురించి అన్నారంటే. 

నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 30న సెలవు దినముగా ప్రకటించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వయసు పైబడిన వాళ్ళు కూడా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ లో కూడా సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఇందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు తేజ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ పాల్గొనని వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మాములుగా చాలా మంది నీళ్లు రాలేదని, రోడ్లు బాగాలేవని, స్కూల్స్ బాగాలేవని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వారందరూ ముందు బయటకు వచ్చి ఓటు వేయాలి. ఓటు వెయ్యని వారికి ప్రశ్నించే హక్కు లేదు. నా ప్రకారం ఓటు వెయ్యని వాళ్లందరూ దేశ ద్రోహులతో సమానం. ఆరోగ్యం బాగోలేని వాళ్లు సైతం వీల్ చైర్స్‌లో వచ్చి ఓటు వేస్తున్నారు.. అనీ బాగున్నా కొంతమంది ఇంట్లోనే ఉంటున్నారు. జూబ్లీహిల్స్‌లో తక్కువ ఓటింగ్ జరుగుతుందంటే ఇక్కడ ఎక్కువ మంది దేశ ద్రోహులు ఉన్నారని అర్థం. ఎవరైతే ఓటు వేయకండా ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తున్నారో.. వాళ్లందరూ దేశ ద్రోహులే.. అంటూ అదిరిపోయే కౌంటర్ వేశాడు తేజ. ఇది చాలా మంది తేజ చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నారు. సార్ మీరు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.