అంబేద్కర్ చౌరస్తాలో .. త్రివిక్రమ్ దిష్టిబొమ్మ దహనం

అంబేద్కర్ చౌరస్తాలో  .. త్రివిక్రమ్  దిష్టిబొమ్మ దహనం

మక్తల్, వెలుగు: గుంటూరు కారం సినిమాలో విలన్లకు ప్రపంచ మేధావులైన కారల్ మార్క్స్, లెనిన్ ల పేర్లు పెట్టడాన్ని నిరసిస్తూ పీడీఎస్​యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో డైరెక్టర్  త్రివిక్రమ్  దిష్టిబొమ్మను దహనం చేశారు.

సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలపాలన్నారు. వెంటనే ఆ పేర్లను తొలగించాలని త్రివిక్రమ్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కిరణ్, సిద్దు, ఈశ్వర్, శారద, అజయ్, మహాదేవి, సావిత్రమ్మ, ఆనంద్, అజయ్, కల్యాణం రాజు పాల్గొన్నారు.