అచ్చంపేట, వెలుగు: దళారుల నుంచి రైతులను రక్షించి వారికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
అంతకుముందు, స్థానిక రైతుల ఇబ్బందులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.
కొండారెడ్డిపల్లిలో నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం
వంగూరు : వంగూరు మండలంలోని ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.
ముఖ్యమంత్రి తల్లి దివంగత ఎనుముల రామచంద్రమ్మ జ్ఞాపకార్థం ‘రామ్ కీ’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు.
