రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ ..ఆధునిక సాగు పద్దతి.. నీటి సంరక్షణ.. దిగుబడి అధికం

రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ ..ఆధునిక సాగు పద్దతి.. నీటి సంరక్షణ.. దిగుబడి అధికం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​ రెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రైతులకు స్ప్రింక్లర్లను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సాగు పద్ధతులను ఉపయోగించి నీటి సంరక్షణతో పాటు దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. అనంతరం తాడూరు మండలంలోని  మేడుపూర్ గ్రామంలో రైతులకు కూరగాయలు పెంపకానికి ఉపయోగపడే ప్లాస్టిక్ ట్రేలు, సేంద్రీయ ఎరువుల తయారీకి వర్మి కంపోస్ట్ బెడ్లు,  తేనెటీగల పెంపకానికి బాక్సులను పంపిణీ చేశారు.