
కోలీవుడ్ స్టార్ విజయ్‌కి ‘వారసుడు’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హిట్‌గా నిలవబోతుంది’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తను డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. తెలుగులో ఈ చిత్రానికి లభిస్తున్న రెస్పాన్స్ గురించి వంశీ మాట్లాడుతూ ‘‘వారసుడు’ రిజల్ట్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్నా. మౌత్ టాక్ సూపర్బ్‌గా ఉంది. సినిమా చూసిన యూత్ తమ ఫ్యామిలీకి చూడమని చెబుతున్నారు. తమిళంలో నా ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ సాధించింది. తెలుగులోనూ ‘మాస్టర్’ కలెక్షన్స్‌ను బీట్ చేస్తుంది. దిల్ రాజుగారికి డబ్బుతో పాటు గౌరవం తెచ్చి పెట్టింది. సెన్సిబిలిటీస్ అనేవి ప్రాంతాన్ని బట్టి వేరేగా ఉండొచ్చు కానీ ఎమోషన్స్ అనేవి యూనివర్సల్. అందుకే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు వారికీ నచ్చింది. ముఖ్యంగా తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో టచ్ చేశారంటూ ప్రతి రోజూ నాకు కాల్స్ వస్తున్నాయి.
విజయ్ గారు దేశవ్యాప్తంగా ఓ పెద్ద స్టార్. ఆయన సినిమాలు ఎప్పటినుండో చూస్తున్న వ్యక్తిగా తన బలాలేమిటో నాకు తెలుసు. ముందే ఈ స్టోరీ లైన్ అనుకున్నప్పటికీ, విజయ్ గారు ఓకే చెప్పాక ఆయనకు తగ్గట్టుగా పాటలు, డ్యాన్సులు, ఫైట్‌లతో ప్యాకేజీగా డెలివర్ చేసాం. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆయన మళ్లీ నాతో కలిసి పనిచేస్తానని చెప్పడం నాపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. నేను కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగా. పెద్ద స్టార్స్‌తో అలాంటి సినిమాలు చేయడానికే వచ్చా. నా దృష్టిలో కథే హీరోని వెతుక్కుంటూ వెళ్తుంది. అందుకే స్టార్స్‌కు అవసరమయ్యే పెద్ద కాన్వాస్ సినిమాలు తీయాలని నమ్ముతున్నా. ఓ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నా. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తా’ అన్నాడు.