ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కాదు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కాదు

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై నమోదైన కేసులో విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను తొలగించడంపై కేంద్రం తీరును నిరసిస్తూ అబ్దుల్లా కామెంట్లు చేశారు. ఫరూక్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ నమైదైన పిల్‌ విచారణ సందర్భంగా సుప్రీం పైకామెంట్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే తప్పుకాదని, ఇది దేశద్రోహం కిందకు రాదని సంజయ్ కిషన్ కౌల్, హేమంత్ గుప్తాల ధర్మాసనం తేల్చిచెప్పింది.