భద్రాద్రి రామయ్య భూములపై ఏపీ అసెంబ్లీలో చర్చ

భద్రాద్రి రామయ్య భూములపై ఏపీ అసెంబ్లీలో చర్చ

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల ఆక్రమణలపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం రంపచోడవర ఎమ్మెల్యే శిరీషాదేవి చర్చకు తెచ్చారు. 1878 లో కొందరు భక్తులు విలీన ఆంధ్రాలోని ఏటపాక మండలం పురుషోత్తపట్నంలో 900 ఎకరాల భూమిని భద్రాద్రి రామయ్యకు దానంగా ఇచ్చారని, వాటిని రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. 1912, 1926,1938 సంవత్సరాల నుంచి జరిగిన క్రయ, విక్రయాల్లో భాగంగా రైతులు కొనుక్కొని పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు. 

రైతులను ఇబ్బందులు పడుతున్నారని, కానీ ఏ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. గతంలో టీడీపీ హయాంలోనే 2002లో దేవస్థానం భూములకు సంబంధించిన అన్నీ పాస్​పుస్తకాలు తయారు చేయించిందని, కోర్టుల ద్వారా ఆలయానికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చిందని గుర్తుచేశారు. ఆక్రమణలు తొలగించే సమయంలో దేవస్థానం సిబ్బందిపై దాడులు కూడా చేస్తున్నారన్నారు. కొద్ది రోజుల కింద దేవస్థానం ఈవోపైనా దాడి జరిందని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే శిరీషా దేవి అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చారు.