బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వైపు జంగా చూపు ?

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వైపు జంగా చూపు ?
  •     డీసీసీ ఇస్తారో, లేదో చెప్పేందుకు నేటి వరకు డెడ్‍లైన్‍
  •     హైకమాండ్‌‌‌‌‌‌‌‌ స్పందించకుంటే 13న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు రాజీనామా
  •     శనివారం ముఖ్య కార్యకర్తలతో జంగా మీటింగ్‌‌‌‌‌‌‌‌

వరంగల్‍, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అసంతృప్త నేత జంగా రాఘవరెడ్డి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వరంగల్‌‌‌‌‌‌‌‌ పశ్చిమ టిక్కెట్‌‌‌‌‌‌‌‌ ఆశించిన జంగాను కాదని నాయిని రాజేందర్‍రెడ్డికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో ఆయన డిసప్పాయింట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. కాంగ్రెస్‍తో పాటు ఫార్వార్డ్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ పార్టీ నుంచి నామినేషన్లు సైతం వేశారు. అయితే తాను నాయినికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలంటే తనకు హనుమకొండ డీసీసీతో పాటు తాను సూచించిన వారికి సిటీ కాంగ్రెస్‍ పోస్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ విషయం కాస్తా ఏఐసీసీ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌ వద్దకు చేరింది. జంగా వర్గానికి డీసీసీ ఇచ్చే అంశంలో రాష్ట్ర స్థాయి నేతల్లో ఓ వర్గానికి ఇష్టం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కానీ జంగా మాత్రం ఆదివారం సాయంత్రంలోగా హైకమాడ్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం చెప్పకుంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వీడాల్సి వస్తే ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌బీ తరఫున బరిలో ఉండనున్నట్లు ప్రకటించిన జంగా.. ఇప్పుడు వినయ్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌ కోసం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వైపు చూస్తున్నట్లు సమాచారం. శనివారం ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జంగా నిర్మయాన్ని కొందరు వ్యతిరేకించగా కాజీపేట ఏరియాకు చెందిన కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ స్థాయి లీడర్లు మాత్రం సమర్ధించినట్లు తెలుస్తోంది. ఇంకొందరు మాత్రం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చే టైంలో పార్టీ వీడితే నష్టపోతామని చెప్పారని సమాచారం. రెండు పార్టీలకు న్యూట్రల్‌‌‌‌‌‌‌‌గా ఉండి ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.