- ముగ్గురు సీఎస్‌లు, ఇద్దరు డీఓలు కూడా..
హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు పడింది. ఐదుగురు ఇన్విజిలేటర్లతో పాటు ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను పరీక్షల విధుల తప్పించారు. మంగళవారం టెన్త్ సెకండ్ లాంగ్వేజీ సబ్జెక్టు పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 4,94,426 మంది రెగ్యులర్ స్టూడెంట్లు అటెండ్ కావాల్సి ఉండగా 4,92,967 మంది హాజరయ్యారు.
400 మంది ప్రైవేటు విద్యార్థులకు గాను 214 మంది అటెండ్ అయ్యారు. మంగళవారం ఐదుగురు స్టూడెంట్లపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. కాగా, జయశంకర్ భూపాలపల్లిలో ముగ్గురు ఇన్విజిలేటర్లు, ఒక సీఎస్, ఒక డీఓతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఇన్విజిలేటర్, ఒక సీఎస్, ఒక డీఓ, కరీంనగర్ లో ఒక సీఎస్, నాగర్ కర్నూల్లో ఒక ఇన్విజిలేటర్‌ను పరీక్షల విధుల నుంచి తప్పించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
