దృష్టి మళ్లించి చోరీ.. క్షణాల్లో పరార్..  ఇరానీ గ్యాంగ్ గుట్టు రట్టు

V6 Velugu Posted on Feb 19, 2021

హైదరాబాద్: జంట నగరాల పరిధిలో అమాయక జనం దృష్టి మళ్లించి చోరీ చేసి క్షణాల్లో పరారయ్యే ఇరానీ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు. గత 30 ఏళ్లుగా చోరీలు చేయడమే పనిగా పెట్టుకున్న నిందితులపై 15 క్రిమినల్ కేసులతోపాటు మరో 15 నాన్ బెయిలబుల్ వారెంట్ లు ఉన్నాయి. ఎన్నిసార్లు  జైలుకెళ్లినా సరే.. జైలు నుంచి బయటకొచ్చారంటే చాలు మళ్లీ చోరీలే. అటెన్షన్ డైవర్షన్ నేరాలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్ గుట్టును సౌత్ జోన్ పోలీసులు రట్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన అలీ, సాధిక్, కుర్బన్ అలీ లను పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితులపై 15 క్రిమినల్ కేసులతో పాటు 15 నాన్ బెయిలబుల్ వారెంట్ లు ఉన్నాయి. నిందితులు అందరూ ఒకటే కుటుంబానికి చెందిన వారు. ముందుగా  కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని రెక్కి నిర్వహిస్తారు.

బాబా అవతారమెత్తి.. మోసం చేసి బిచాణ ఎత్తేస్తారు

ఇరానీ గ్యాంగ్ ముఠా అవసరమైతే బాబాల అవతరమెత్తుతారు. కష్ట సుఖాలను తెలుసుకుంటూ..  అమాయకులకు గాలం వేస్తారు. వీలున్నంత మేర దోచుకుంటారు. మరీ అమాయకంగా కనిపిస్తే బంగారం ఆభరణాలను రెట్టింపు చేస్తామని నమ్మబలుకుతారు. ఆభరణాలు తీసుకుని బిచాణ ఎత్తేసి మాయమైపోతున్న ఇరానీ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచించారు. అమాయకుల నుండి ఇరానీ గ్యాంగ్ దోచుకున్న 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇళ్లలో చోరీలు చేసే ముస్తఫాఖాన్ అరెస్టు

ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముస్తఫా ఖాన్ ను కూడా అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు.  1992 నుంచి నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై 42 కేసులు ఉన్నాయని, 15 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయన్నారు. ఇళ్లలో చోరీలు చేయడం ముస్తాపకు అలవాటు గా మారిపోయిందని, 2015లో నిందితుడిపై పీపీ యాక్ట్ పెట్టినా మారలేదని, జైలు కు వెళ్లి వచ్చిన తరువాత కూడా మళ్లీ ఇళ్లలో నేరాలకు  పాల్పడుతున్నాడని తెలిపారు.

For more news…

ఏం కష్టమొచ్చిందో.. పెళ్లయిన ఆర్నెళ్లకే నవ వధువు మృతి

అడ్వకేట్ దంపతుల హత్య కేసులో టీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ మేనల్లుడు బిట్టు శీను అరెస్ట్

ఊహించని ఘటన ఎదురైతే ఎలా రియాక్ట్ కావాలి?

నర్సరీతో ఆ నలుగురు.. ఉద్యోగాలు పోవడంతో సొంత బిజినెస్

Tagged Hyderabad, Arrested, series, theft, roberry gang, Stealing, moments

Latest Videos

Subscribe Now

More News